close
సౌదీలో విశాఖ వాసి హత్య

దౌత్య కార్యాలయంతో కుటుంబ సభ్యుల సంప్రదింపులు

ఎం.వి.పి.కాలనీ: సౌదీ అరేబియాలో విశాఖకు చెందిన అబ్దుల్‌ అయాజ్‌ హత్యకు గురయ్యారని, అయితే మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోందని అయాజ్‌ కుమార్తె సమీనా షేక్‌ చేసిన ట్వీట్‌తో యంత్రాంగం చర్యలకు దిగింది. ఈ జాప్యంపై సమీనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ట్వీట్‌ చేయటంతో అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు విశాఖ పోలీసులు వీరి వివరాల కోసం ఆరా తీశారు. అయితే ఈ కుటుంబ వివరాల కోసం విశాఖలో ఎంత ప్రయత్నించినా తెలియలేదు. సమీనా కూడా ఈ సంఘటనపై ఎక్కడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో చిరునామా తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే బాధిత కుటుంబం దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారులు మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ హత్య కేసులో ఓ నిందితుడిని కూడా సౌదీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోందని విశాఖ ఏడీసీపీ (ఎస్‌.బి.) శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని