close
అమెరికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ

లూయివిల్‌: అమెరికాలోని కెంటకి రాష్ట్రం లూయివిల్ నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్‌) కెంటకి చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన బతుకమ్మలను ప్రవాస భారతీయులు స్థానిక హిందూ దేవాలయానికి తీసుకొచ్చారు. వేదిక మీద అందంగా అమర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అని ఆడుతూ పాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. టీడీఎఫ్‌ సంస్థ తరఫున శ్యాం కోయ, మదన్ పోల్కం, సుధాకర్ వెల్ది, ప్రదీప్, సుజిత్, రాజగోపాల్, వెంకట్ బుస్సు, రామ్ ప్రసాద్ ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతగానో కృషి చేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని