close
కెనడాలో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు

ఎడ్మంటన్‌: కెనడాలోని ఎడ్మంటన్‌ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎడ్మంటన్‌ నగరంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఈ వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో దాదాపు వంద మందికిపైగా మహిళలు, పిల్లలు పాల్గొని ఆటపాటలతో సంతోషంగా గడిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలిసేలా సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు ఆడిన ఆటపాటలు, పిల్లలు ఆడిన దాండియా ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని