close
డబ్లిన్‌లో బతుకమ్మ వేడుకలు

డబ్లిన్‌: ఐర్లాండ్‌లోని తెలంగాణకు చెందిన ప్రవాసులు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో 40 మంది వాలంటీర్స్ సంయుక్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. వాలంటీర్లు, దాతల సహాయంతో గత ఏడేళ్లుగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. డబ్లిన్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 700 మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు, అమ్మాయిల ఆటపాటలు, దాండియా ఆటలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు, కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ బతుకమ్మ విశిష్టతను పిల్లలకు వివరించారు. ఏ దేశంలో స్థిరపడినప్పట్టికీ భావితరాలు భారతీయ మూలాలు మర్చిపోకూడదనే సదుద్దేశంతోనే ఏడేళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలంగాణకు చెందిన ప్రవాసులు, కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఎంతో అందంగా బతుకమ్మలను తీర్చిదిద్దిన ఆడపడుచులకు నిర్వాహకులు బహుమతులు అందించారు.

బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వాలంటీర్లు సాగర్ సిద్ధం, ప్రబోధ్ మేకల, కమలాకర్ కోలన్, జగన్ మేకల, వెంకట్ తిరు, దయాకర్  కొమురెల్లి, శ్రీనివాస్ కార్ప్, వెంకట్ గాజుల, త్రిషేర్ పెంజర్ల, సుమంత్ చావ, నవీన్ గడ్డం, ప్రవీణ్‌ లాల్‌, అనిల్ దుగ్యాల, నరేందర్ గూడ, రమణా రెడ్డి యానాల, శ్రీనివాస్ వెచ్చ, అల్లే శ్రీనివాస్, వెంకట్ జూలూరి, రవీందర్ చప్పిడి, మహేష్ అలిమెల్ల, శ్రీనివాస్ అల్లంపల్లి, శ్రీధర్ యంసాని, శ్రీనివాస్  సిల్వెని, శ్రీనివాస్ పటేల్, షరీష్ బెల్లంకొండా, బలరాం, ప్రదీప్ రెడ్డి యల్క, నగేష్ పుల్లూరు, కొసనం శ్రీనివాస్, రామగౌడ్, వెంకట్ అక్కపల్లి, వల్లపరెడ్డి ఉపేందర్ రెడ్డి, శ్రీధర్ రాపర్తి, సత్య పోతు, బాచి రెడ్డి, భాను బొబ్బల, శశిధర్ మర్రి, సంతోష్ పల్లె, సంపత్, వినోద్ పెరురి, రాధ కొండ్రగంటి తదితరులకు కార్యక్రమ నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని