close
స్విట్జర్లాండ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ

బెర్న్‌: స్విట్జర్లాండ్‌లోని తెలంగాణ జాగృతి శాఖ ఆధ్వర్యంలో జురిచ్‌ నగరంలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రవాస కుటుంబాల మహిళలు, పిల్లలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను పేర్చి, గౌరీ పూజలు చేశారు. పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు. గాయని స్వాతి రెడ్డి తన పాటలతో అందరినీ అలరించారు. ఈ ఉత్సవాల్లో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ స్థానిక ప్రతినిధులు బార్బరా, మథియాస్‌, జికాలు, తెలంగాణ జాగృతి స్విట్జర్లాండ్‌ అధ్యక్షులు కిశోర్‌ తాటికొండ, శ్రీధర్‌ గందే, అల్లు కృష్ణారెడ్డి, పవన్‌ దుద్దిళ్ల, యువరాజ్‌ రాచకొండ, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని