close
హ్యూస్టన్‌లో వేడుకగా బతుకమ్మ సంబరాలు

హ్యూస్టన్‌: అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణవాసులంతా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి, అనంతరం మహిళలు చుట్టూ చేరి ఆడుతుంటే జనమయం ఇండియా హౌస్‌ అంతా భక్తి పారవశ్యంలో మునిగితేలింది. మహిళలతో పాటు చిన్నారులు కోలాటంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేందుకు ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుందని అక్కడికి వచ్చిన మహిళలు తెలిపారు. ఈ పండుగ ద్వారా మహిళ ఆత్మగౌరవాన్ని మరింత పెంచినట్లు ఉందని వారు పేర్కొన్నారు. ప్రతియేటా లాగే ఈసారి కూడా హ్యూస్టన్‌లో బతుకమ్మ సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 


వార్తలు / కథనాలు

మరిన్ని