close
అమెరికాలో వైభవంగా...

భారీ బతుకమ్మ వద్ద మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన వనీల, లక్ష్మి

మంచిర్యాల సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అమెరికాలోనూ అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు వైభవోపేతంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి ఆడిపాడారు. జిల్లావాసులు సైతం ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు. అమెరికాలోని ఫినిక్స్‌, నార్త్‌కరోలినియా రాష్ట్రాలలో బతుకమ్మ ఉత్సవాలను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు యువతులు తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలు ధరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు. బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారని అమెరికాలో స్థిరపడ్డ జిల్లావాసులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని