close
మెల్‌బోర్న్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో తెలంగాణ అసోసియేషన్‌(ఏటీఏఐ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా ఎంపీ జిల్‌ హెనేస్సి విచ్చేసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ ఆడటం ఎంతో ఆనందం కలిగించిందని, ఈ ఉత్సవాలు స్త్రీల గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న తరాలకు తెలంగాణ సంప్రదాయం తెలియజేసేందుకు ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఆరు నెలల నుంచి ఎంతో శ్రమించిన వలంటీర్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ వేడుకల్లో సుమారు 5వేల నుంచి 6వేల మంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.     


 

వార్తలు / కథనాలు

మరిన్ని