close
లండన్‌లో చరిత్ర సృష్టించిన ‘బతుకమ్మ’

లండన్‌: లండన్‌లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో 3వేల మందికి పైగా పాల్గొని యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మగా చరిత్ర సృష్టించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు దుర్గమ్మకు, శమీ వృక్షానికి పూజలు చేసి బతుకమ్మను ప్రారంభించారు.ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు భావి తరాలకు తెలిపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నారై సంఘాలకు అభినందనలు తెలిపారు. ప్రకృతిని పూజించే పండుగలు చేసుకోవడం తెలంగాణ సంస్కృతికి చిహ్నమని అన్నారు. భారత రాయబారి కార్యాలయం ఉన్నతాధికారి మనమీత్ నరాంగ్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశానికి చెందిన అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం తొలిసారిగా చూస్తున్నానని అన్నారు. అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఎన్‌ఆర్‌ఐలపై ఉందని, ఏడేళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ అధ్యక్షుడు ప్రమోద్‌గౌడ్ మాట్లాడుతూ.. యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. యూరోప్‌లోనే మొట్టమొదటి బతుకమ్మను నిర్వహించిన తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్‌ను అభినందించారు. అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ సభ్యులదే అని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ అన్నారు. ప్రధాన కార్యదర్శి రంగు వెంకట్, కార్యదర్శి పిట్ల భాస్కర్, సలహా సభ్యులు డా.శ్రీనివాస్, మహేశ్‌ జమ్ముల, వెంకట్ స్వామి, బాలకృష్ణారెడ్డి, మహేశ్‌ చాట్ల, శేషు అల్లా, వర్మ, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీశ్‌, రాజు కొయ్యడ, నర్సింహారెడ్డి నల్లలు పాల్గొన్నారు. మహిళా విభాగం నుంచి మీనా అంతటి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల, జయశ్రీ, శ్రీవాణి మార్గ్, సవిత జమ్మల, దివ్య, అమృత, శిరీష, ఆశ, ప్రియాంక, రోహిణి బతుకమ్మ నిర్వహణలో పాల్గొని విజయవంతం చేశారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని