close
న్యూజెర్సీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల సందర్భంగా అక్కడ నివసించే తెలంగాణ మహిళలు పిల్లలతో కలిసి వచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. పూలతో బతుకమ్మను అలంకరించి చుట్టూ చేరి ఆడిపాడారు. చిన్నారులు సైతం కోలాటం ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. తెలంగాణవాసులంతా ఒక్క చోట కలవడంతో తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఏటా ఇలాగే వేడుకలు జరుపుకొంటున్నామని అక్కడికి వచ్చిన మహిళలు తెలిపారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే అవకాశం దక్కుతోందని వారు ఆనందం వ్యక్తం చేశారు.


 

వార్తలు / కథనాలు

మరిన్ని