close
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు


బతుకమ్మతో జిల్లావాసులు

శ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే: సింగపూర్‌ తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసారి సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించేవారందరి సౌలభ్యం కోసం వేడుకలను నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. పంగ్గోల్‌, వుడ్‌ల్యాండ్స్‌, యెవ్‌ టీ, టాంపినెస్‌ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ సంబురాలు జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది మహిళలు, యువతులు, చిన్నారులు పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. తెలంగాణవాసులంతా ఒక్క చోట కలవడంతో విదేశంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయేలా చేస్తుందని నిర్వాహకులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

నాలుగు ప్రాంతాల్లో సందడి చేసిన తెలంగాణ మహిళలు

వార్తలు / కథనాలు

మరిన్ని