close
జర్మనీలో బతుకమ్మ సంబరాలు

జర్మనీలో బతుకమ్మ సంబరాల్లో మహిళలు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: బతుకమ్మ ఆటలు విదేశాల్లోనూ సందడి చేస్తున్నాయి. ఉయ్యాలో అంటూ పాటలు మారుమోగుతున్నాయి. విదేశాల్లో వివిధ వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడిన ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాకు చెందిన మహిళలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం జర్మనీలోని మ్యూనిచ్‌ నగరంలో పలువురు మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. అక్కడ నాలుగోసారి ఏర్పాటుచేసిన వేడుకల్లో 200 మంది మహిళలు ఆడిపాడారు. వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఇతర రంగాల్లో స్థిరపడిన బతుకమ్మ సంబురాలను వైభవంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేస్తున్నామని, వారు కూడా సంతోషంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు సుష్మ, శ్రీలత, మానస, కీర్తన, పుష్ప, మంజుల, సృజన, సంగీత, శైలజ, శిరీష చెప్పారు.


ఆడి పాడిన మహిళా ఉద్యోగులు

హన్మకొండలో కూరగాయల బతుకమ్మతో ఐసీడీఎస్‌ అధికారులు


జనగామలో బతుకమ్మ ఆడుతున్న మెప్మా ప్రతినిధులు


డోర్నకల్‌ మున్సిపాలిటీలో మహిళల బతుకమ్మ సంబరాలు

వార్తలు / కథనాలు

మరిన్ని