close
హౌడీ మోదీ.. సందడే సందడి

హ్యూస్టన్‌: ప్రవాస భారతీయులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం విజయవంతమైంది. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్జీ స్టేడియం ప్రవాస భారతీయులతో కిక్కిరిసిపోయింది. అక్కడ పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో ప్రవాస భారతీయుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం భారతీయ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని అభయమిచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు మీకోసం..

 అభివాదం చేసుకుంటూ స్టేడియం లోపలికి వస్తున్న మోదీ, ట్రంప్‌.

 ‘హౌదీ మోదీ’ కార్యక్రమం కోసం వేదికపైకి వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

 ప్రసంగానికి ముందు ట్రంప్‌ను ఆలింగనం చేసుకుంటున్న మోదీ.

 భారతీయ అమెరికన్లకు అభివాదం చేస్తున్న మోదీ.

 ప్రధాని మోదీ ప్రసంగానికి ముగ్దుడైన ట్రంప్‌ చప్పట్లు కొడుతున్నారిలా.

భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ప్రవాస భారతీయుల పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సరిహద్దులు దాటినా సంప్రదాయాలు మర్చిపోలేదని గుర్తు చేశారు.

 ‘హౌదీ మోదీ’ కార్యక్రమం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది. నెలల వయసున్న బిడ్డను పట్టుకుని ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న తండ్రి.

స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మోదీకి ఉండే క్రేజ్‌ను చెబుతోందీ చిత్రం

 ప్రసంగం మధ్యలో మనస్ఫూర్తిగా నవ్వుతూ ట్రంప్‌.

 అల్లరి చేస్తున్న చిన్నారిని వారిస్తున్న తండ్రి.

‘హౌదీ మోదీ’ కార్యక్రమం ఎంత విజయవంతమైందో చెప్పడానికి ఈచిత్రమే నిదర్శనం.

వార్తలు / కథనాలు

మరిన్ని