close
డాలస్‌లో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

డాలస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్‌ (టీపీఏడీ) ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో బతుకమ్మ, దసరా సంబురాలు మొదలయ్యాయి. స్థానిక లెబనాన్ రోడ్డులో గురువారం బొడ్డెమ్మ పున్నం వేడుకలను మహిళలు వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ గౌరీ దేవిని పూజిస్తూ తెలంగాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టేలా బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మను సమీపంలోని నీటి కొలనులో నిమజ్జనం చేశారు. సెప్టెంబర్ 27న కొప్పెల్‌లోని ఆండ్రూ బ్రౌన్ పార్కులో ఎంగిలి బతుకమ్మ వేడుకలు, అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్‌లో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల్లో సుమారు 10 వేల మంది తెలుగువారు పాల్గొననున్నట్టు టీపీఏడీ నిర్వాహకులు వెల్లడించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని