close
వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో ప్రవాసాంధ్రులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. వర్జీనియా రాష్ట్రంలోని వాషింగ్టన్ డీసీలో స్టెర్లింగ్‌లో బొజ్జ గణపయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.  మైఖేల్‌ అండ్ సన్స్ స్పోర్ట్స్ ఆడిటోరియంలో 20 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏడురోజుల పాటు మండపంలో వుంచిన గణపయ్యను సుమారు 40వేల మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా తరలివెళ్లి సమీపంలో ఉన్న పొటోమాక్‌ నదిలో గణేశుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా చిన్నా పెద్దా అంతా కలిసి నృత్యాలు చేయడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. అందరూ వినాయకుడి విగ్రహం వద్ద ఫొటోలు దిగుతూ సందడి చేశారు. గణపతి మండపంలో ఏర్పాటు చేసిన 2వేల కిలోల లడ్డూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.


వార్తలు / కథనాలు

మరిన్ని