close
అమరావతిపై స్పందించిన సింగపూర్‌ ఆర్థిక మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై సింగపూర్‌ ఆర్థిక మంత్రి వీవీఎన్‌ బాలకృష్ణన్ స్పందించారు. కొత్త ప్రభుత్వ నిర్ణయాలు గమనిస్తూనే ఉన్నామన్నారు. అమరావతి ప్రణాళికపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించుకోవచ్చని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును రివ్యూ చేయాలనుకుంటోందని సింగపూర్‌ కన్సార్షియం తమకు తెలిపిందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం కోసం తాము వేచిచూస్తున్నామని, సమీక్ష ప్రభావాన్ని కూడా అంచనా వేసుకుంటున్నామని ఆయన సింగపూర్‌లో జరిగిన ఓ సదస్సులో తెలిపారు. ప్రాజెక్టులపై సమీక్షించుకునే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.
 

వార్తలు / కథనాలు

మరిన్ని