close
శ్రీహర్ష కథ విషాదాంతం

హైదరాబాద్: గత నెల 21న లండన్‌లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి శ్రీహర్ష కథ విషాదాంతమైంది. బీచ్‌ ఒడ్డున ఇవాళ ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు శ్రీహర్ష తల్లిదండ్రులకు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడి దుస్తులు, పర్సు చూసిన ఆయన తండ్రి మృతదేహాన్ని శ్రీహర్షదిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరానికి చెందిన సన్నే శ్రీహర్ష  క్వీన్స్‌ యూనివర్సిటీలో పీజీ చదివేందుకు లండన్‌ వెళ్లాడు. ఈయన తండ్రి పేరు ఉదయ్‌ప్రతాప్‌. ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్‌లో చదువుకుంటున్న శ్రీహర్ష గత నెల 21న లండన్‌ బీచ్‌కు వచ్చి కనిపించకుండాపోయాడు.  12 రోజులుగా శ్రీహర్ష ఆచూకీ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

వార్తలు / కథనాలు

మరిన్ని