close

తాజా వార్తలు

భారత్‌కు పోటీ ఇవ్వాలని శ్రమిస్తున్నాం

థానే: భారత్‌ పిచ్‌లకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్ రూథర్‌ఫర్డ్‌ తెలిపాడు. ‘టీమ్ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. భారత్‌లో అధికశాతం పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. ఇక్కడి పిచ్‌లకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచకప్‌, ఐపీఎల్ గురించి ఆలోచించట్లేదు. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. ప్రతి సిరీస్‌ నుంచి పాఠాలు నేర్చుకుంటాం. పూర్తిస్థాయిలో ప్రదర్శన చేయాలని మాత్రమే భావిస్తున్నాం. పొలార్డ్‌, రసెల్‌ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను. వారిలా మిడిల్‌ ఆర్డర్‌లో రాణించాలి. సారథిగా పొలార్డ్‌ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అతడితో మన ఆలోచనల్ని పంచుకోవచ్చు. ప్రాక్టిస్‌సెషన్‌లో అతడు నూతనోత్సహం నింపుతాడు. బౌలింగ్‌లో రాణించగలను. కానీ, బ్యాట్‌తో చెలరేగితేనే నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని పేర్కొన్నాడు. 

భారత్‌తో వెస్టిండీస్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 డిసెంబర్‌ 6న ఉప్పల్‌లో జరగనుంది. రెండో టీ20 డిసెంబర్‌ 8న తిరువనంతపురంలో, ఆఖరి టీ20 డిసెంబర్ 11న ముంబయిలో జరగనుంది. డిసెంబర్ 15న చెన్నై వేదికగా తొలి వన్డే, డిసెంబర్‌ 18న విశాఖపట్నంలో రెండో వన్డే, చివరి వన్డే డిసెంబర్ 22న కటక్‌లో జరగనుంది. ఇటీవల అఫ్గాన్‌తో తలపడిన మూడు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్‌ 1-2 తేడాతో కోల్పోయింది. ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.