close

తాజా వార్తలు

సీపెక్ పాక్‌పై గుదిబండ: అమెరికా

వాషింగ్టన్‌: చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా(సీపెక్‌) వల్ల దాయాది దేశం పాక్‌కు ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిందని అమెరికా హెచ్చరించింది. దీని వల్ల చైనాకే అధిక లాభం అని వివరించింది. ఓవైపు పాకిస్థాన్‌లో నిరుద్యోగం తాండవిస్తోంటే చైనా మాత్రం ఈ ప్రాజెక్టులో తమ కార్మికుల్ని, ఉత్పత్తిదారుల్లే భాగం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా విభాగం సెక్రటరీ అలైస్‌ వెల్స్‌ తెలిపారు. అలాగే పెద్దగా లాభం చేకూర్చని రాయితీల్ని పాక్‌ మెడకు కట్టబెడుతోందన్నారు. ఈ ప్రాజెక్టు పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థపై గుదిబండగా పరిణమించనుందని హెచ్చరించారు. రానున్న ఆరేళ్లలో చైనాకు పాక్‌ భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు స్థానంలో అమెరికా కంపెనీల్ని ఆహ్వానిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఉబర్‌, పెప్సికో, కోకా-కోలా లాంటి పలు కంపెనీలు దాదాపు 1.3 బిలియన్‌ డాలర్ల మేర పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు.

చైనాలోని జింగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టు వరకు ఈ కారిడార్‌ నిర్మించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే సాగుతున్నాయి. ఇందులో భాగంగా పాక్‌లో చైనా పలు రోడ్డు, రైలు మార్గాలు నిర్మించనుంది. అలాగే పలు పోర్టులను ఆధునికీకరించనుంది. ఈ మేరకు పాకిస్థాన్‌కు చైనా భారీగా రుణాలు అందించింది. అయితే ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గుండా సాగుతుండడంతో భారత్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.