
తాజా వార్తలు
ప్రయాగ్‌రాజ్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పుట్టిన ఇల్లు ‘ఆనంద్భవన్’కు ఇంటిపన్ను నోటీసులు అందాయి. రూ.4.35 కోట్ల మేరకు పన్ను బకాయి ఉన్నారన్నది ఈ నోటీసుల సారాంశం. ఈ ఇంటిని నివాసం లేని భవనాల కేటగిరిలో చేర్చారు. 2013 నుంచి ‘ఆనంద భవన్’కు పన్ను కట్టలేదని అధికారులు వివరించారు. ఈ భవనం ఇందిరా గాంధీ కుటుంబానికి చెందినది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న జవహర్లాల్ నెహ్రూ ట్రస్ట్ దీని బాగోగులు చూసుకుంటోంది.
దీనిపై ట్యాక్స్ అసెస్మెంట్ ఆఫీసర్ పీకే మిశ్రా మాట్లాడుతూ..‘మున్సిపల్ కార్పొరేషన్, ఆస్తి పన్ను నియమాల ప్రకారం ఆనంద్ భవన్‌కు నోటీసులు జారీ చేశాం. దీనిపై మేం సర్వే చేసి ఎంత పన్నుబకాయి ఉందో నిర్ణయించాం. ఈ సర్వేపై అభ్యంతరాలుంటే చెప్పాల్సిందిగా ప్రకటన కూడా చేశాం. కానీ, దీనిపై ఎవరూ స్పందించలేదు. దీంతో భవనానికి సంబంధించి నోటీసులు పంపించాం’ అని మిశ్రా తెలిపారు.
అయితే, దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్యాక్స్ అసెస్మెంట్ అధికారుల తీరును ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్ ఖండించారు. జవహర్లాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే అన్నింటికీ పన్ను మినహాయించారని, ఇప్పుడు నోటీసులు ఇవ్వడంలో అర్థమేంటని ఆయన ప్రశ్నించారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
