
తాజా వార్తలు
హాంకాంగ్: సంపూర్ణ ప్రజాస్వామ్యమే లక్ష్యంగా గత కొన్ని వారాలుగా జరుగుతున్న నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకిపోతోంది. హాంకాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున హింసాత్మక అల్లర్లకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. యూనివర్శిటీని తమ అధీనంలోకి తీసుకుని ఆందోళనకారులను నిర్బంధించారు. అయితే పోలీసుల నిర్బంధం నుంచి నిరసనకారులు తప్పించుకున్న తీరు సినిమాను తలపిస్తోంది. సోమవారం రాత్రి నల్ల ముసుగులు ధరించిన పదుల సంఖ్యలో ఆందోళనకారులు తాళ్ల సాయంతో యూనివర్శిటీ భవనంపై నుంచి కిందకు దిగి అప్పటికే అక్కడ ఉంచిన బైక్‌లపై పారిపోయారు.
ఇది జరిగిన కాసేపటికే వేల సంఖ్యలో ఆందోళనకారులు పాలిటెక్నిక్ యూనివర్శిటీవైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నేరస్థుల అప్పగింత బిల్లు పేరుతో హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసేందుకు చైనా యత్నిస్తోందంటూ 75లక్షల మంది హాంకాంగ్ వాసులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పలు పాఠశాలలు మూతబడ్డాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అయితే ఈ ఆందోళనలను ఏ మాత్రం సహించబోమంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన చైనా.. నిరసనలను అణచివేసేందుకు అవసరమైతే తమ సైనిక బలగాలను రంగంలోకి దించుతామని ప్రకటించింది. దీంతో ఆందోళనలు మరింత ఉద్ధృతంగా మారాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
