close

తాజా వార్తలు

కూతురు బతికొస్తుందని మృతదేహాంతో ప్రార్థనలు

మావూ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ ఎంత ముందడుగు వేస్తున్నా.. మూఢనమ్మకాల్ని నమ్మకాల్ని మాత్రం వెనక్కి నెట్టలేకపోతోంది. చనిపోయిన తమ నాలుగేళ్ల చిన్నారి తిరిగి బతుకుందనే గుడ్డినమ్మకంతో ఓ జంట ఇంట్లోనే మృతదేహం పెట్టుకుని ప్రార్థనలు జరిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావూ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరవింద్‌ వనవాసి అనే వ్యక్తి కూతురు నవంబర్‌ 14న అనారోగ్యానికి గురైంది. మరుసటి రోజే కోలుకోలేక ఆ చిన్నారి మృతిచెందింది. కొందరు బంధువులు ఇంట్లోనే ప్రార్థనలు చేయమని సలహా ఇచ్చారు. దీంతో వనవాసి వారి మాటలు నమ్మి ప్రార్థనలు జరిపాడు. మృతదేహం దుర్వాసన వస్తుండటంతో ఈ విషయం చుట్టుపక్కల వారు జిల్లా ఎస్పీ అనురాగ్‌ ఆర్యకు సమాచారమందించారు. వనవాసిని, అతడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆదివారం అంత్యక్రియలు జరిపించామని ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌ కుమార్‌ తివారీ చెప్పారు.

 
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.