
తాజా వార్తలు
లఖ్‌నవూ: ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కారణంగా కాలుష్యం తారస్థాయికి చేరుకోవడంతో దాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్రాలు కదులుతున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ఈ విషయమై అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ గోయెల్‌తో సమావేశమైన సీఎం పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాని ప్రభావం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతులు ఇలాంటి చర్యలు మానుకొని సేంద్రీయ ఎరువులుగా ఉపయోగించుకునేలా సంబంధిత అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. గత నెలలో కూడా యోగి ఆదిత్యనాథ్ పంటల వ్యర్థాలు దహనం చేయవద్దని రైతులను కోరారు. నవంబర్ 13న హరియాణా ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడినందుకు 189 రైతులకు జరిమానా విధించింది.
పలు ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పంట పూర్తయిన తర్వాత దహనం చేస్తున్న విషయం తెలిసిందే. వాటి ప్రభావం దేశ రాజధాని దిల్లీపై పడుతుండడంతో అక్కడ కాలుష్యం తారస్థాయికి చేరుకుని గాలి నాణ్యత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంటవ్యర్థాల దహనాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
