
తాజా వార్తలు
దిల్లీ: భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ ప్రాజెక్టులో భాగంగా ఏడుగురు పైలట్లను శిక్షణ కోసం రష్యా పంపుతున్నట్లు వాయుసేన తెలిపింది. మొత్తం 12 మంది వ్యోమగాముల నుంచి ఏడుగురిని ఎంపిక చేసినట్లు ఐఎఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. రష్యాలో వారు శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తరువాత మిగిలిన వారిని పంపుతామని ఆయన పేర్కొన్నారు. వీరిలో చివరికి నలుగురిని మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. ఒకరు లేదా ఇద్దరిని గగన్ యాత్రిస్గా ఎంపిక చేస్తామని తెలిపారు. గగన్‌యాన్ భారత దేశంపు తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్. ప్రతిష్టాత్మకమైన ఈ మిషన్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దీన్ని డిసెంబర్ 2021 నాటికి ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మొదట ఈ ప్రాజెక్టుకు పైలట్ల అర్హత వయసును 30గా పెట్టినప్పటికీ తర్వాత దాన్ని 41కి పెంచారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
