
తాజా వార్తలు
న్యూదిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్న వేళ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయాలు, రైళ్లు నిండుతున్నాయ్.. ప్రజలకు పెళ్లిళ్లవుతున్నాయ్.. ఆర్థిక వ్యవస్థ బాగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు అంటూ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రారంభించబోయే సరకు రవాణా కారిడార్‌ను పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన ఈవిధంగా స్పందించారు.
‘‘ఎయిర్‌పోర్టులు నిండుతున్నాయ్. రైళ్లూ నిండుతున్నాయ్. జనాలకు పెళ్లిళ్లవుతున్నాయ్. ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉందనడానికి ఇవే నిదర్శనాలు. అయినా మూడేళ్లకోసారి డిమాండ్ తగ్గడం నిత్యం జరిగేదే. మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం సహజం. కానీ కొందరు కావాలనే పనిగట్టుకుని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంటారు’’ అంటూ ప్రతిపక్షాలపై సురేశ్ అంగడి మండిపడ్డారు. మరోవైపు ఆర్థిక మందగమనం సహా పలు అంశాలపై రాబోయే శీతకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
