
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ కేంద్రం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడంలో ఆయన పాత్ర ఉండటం దురదృష్టకరం అంటూ విమర్శించారు. కర్ణాటక మాదిరిగానే ఇక్కడ కూడా భాజపాకు మెజారిటీ నిరూపించుకునే అవకాశం వచ్చినపుడు మూడు వారాల గడువు ఇచ్చారు. కానీ వారు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చే సరికి కేవలం 24 గంటలే ఇచ్చారని విమర్శించారు. 2014 తర్వాత నుంచి మేము గవర్నర్లను గమనిస్తున్నాం. ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అనైతికమైన పని అని ఆరోపించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ట్విస్టులకు తెరదించుతూ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ గవర్నర్ కొశ్యారీ కేంద్రానికి నివేదిక పంపిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన కేబినెట్ ప్రతిపాదించిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
