
తాజా వార్తలు
వైరల్ అవుతున్న వీడియో
ఇంటర్నెట్ డెస్క్: కృతజ్ఞత మనిషి లక్షణం అంటారు. కానీ జంతువులు కూడా ఈ స్వభావాన్ని కలిగి ఉంటాయని తెలిపే ఘటనే ఇది. తన పిల్లను రక్షించిన వారికి కృతజ్ఞతలు చూపడానికి వెనక్కి వచ్చిన ఒక ఏనుగు వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఎలాపడిందో ఏమో గానీ.. ఒక గున్న ఏనుగు చిన్న గోతిలో పడిపోయింది. బయటపడటానికి ఎంత ప్రయత్నించినా జారుతున్న మట్టి వల్ల సాధ్యం కాలేదు. దానిని కాపాడటానికి తల్లి, గుంపులో ఉన్న ఇతర ఏనుగులు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు స్పందించారు. పొక్లేనర్తో కొందరు ప్రయత్నించడంతో బయటపడిన గున్న ఏనుగు ఒక్క ఉదుటన తల్లి దగ్గరకు పరుగుతీసింది. ఇక్కడే మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించే సంఘటన జరిగింది. కుటుంబంతో సహా అడవిలోకి తిరుగుముఖం పట్టిన తల్లి ఏనుగు వెనక్కి తిరిగి.. కాసేపు తొండాన్ని ఎత్తి తన పిల్లను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియోను ఓ అటవీ అధికారి ట్విటర్లో షేర్ చేయగా ఇప్పటికే 36 వేల మందికి పైగా చూశారు, 11 వేల మంది రీట్వీట్ చేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
