close

తాజా వార్తలు

చదవడమే.. అసలైన రహస్యం

విద్యార్థికి శశిథరూర్‌ సలహా   

న్యూ దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కి ఆంగ్ల భాష మీద ఉన్న పట్టు గురించి కొత్తగా చెప్పాల్సినదేమీ లేదు. వివిధ సందర్భాలలో కొత్త ఆంగ్ల పదాలతో ఆయన చేసిన ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్‌ అవుతుంది. ఇందులో పదవ తరగతి విద్యార్థి అడిగిన ప్రశ్నకు   శశి థరూర్‌ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసులు గెలుచుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న థరూర్‌ను విద్యార్థి మీకున్న భాషా పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనతో పాటు ఇక్కడున్న వారందరూ నేర్చుకోవటం కోసం ఏదైనా కొత్త పదాన్ని సూచించండి అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా శశిథరూర్‌ ‘‘నేను నీకు చాలా తేలికైన, పాత పదాన్నే చెప్తాను. అదేంటంటే రీడ్‌ (చదవటం). ఆ విధంగానే నేను నా భాషా పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను’’ అని తెలిపారు.

‘‘చాలా మంది నేను రోజూ నిఘంటువు చదువుతుంటానని అనుకుంటారు. కాని ఇప్పటి వరకు చాలా తక్కువ సార్లు నేను డిక్షనరీని ఉపయోగించాను. దానికి బదులుగా ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. దీనికి కారణం మొబైల్‌ ఫోన్‌, కంప్యూటర్‌, టీవీ, ప్లేస్టేషన్ వంటివి మా కాలంలో లేవు. అప్పుడు నా దగ్గర ఉన్నవన్ని పుస్తకాలే’’ అని అన్నారు. విద్యార్థికి శశిథరూర్‌ ఇచ్చిన సలహా విన్న నెటిజన్లు ‘‘మీ జ్ఞానం అపారం’’, ‘‘మీరు చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం’’ అని అభినందిస్తున్నారు. 

 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.