
తాజా వార్తలు
ఉగ్రవాదం వీడి జనజీవన స్రవంతిలోకి 60 మంది యువకులు
దిల్లీ: దారి మళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘ఆపరేషన్ మా’ పేరుతో ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా ఇప్పటివరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం పడగ నీడను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ కుటుంబాలను చేరుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారు.
ఏమిటీ ‘ఆపరేషన్ మా’?
‘‘ఈ పథకం ముఖ్య లక్ష్యం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన కశ్మీరు యువతను వెనక్కి తీసుకువచ్చి సమాజంతో మమేకం అయ్యేలా చేయడమే. ఇది కేవలం స్థానిక యువత కోసమే రూపొందించిన కార్యక్రమం. ఉగ్రవాద మార్గం నుంచి మళ్లించడమే కాకుండా వారికి పునరావాసం కల్పించే బాధ్యతను కూడా భారత సైన్యం తీసుకుంటుంది. పెడదారి పట్టిన యువత మనసు మార్చడం వారి మాతృమూర్తుల వల్లే సాధ్యం. మేము వారి తల్లుల ద్వారా వారు ఉగ్రవాదం వీడేలా ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకే ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్ మా’ అని పేరుపెట్టాం.’’ అని దీనికి నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. థిల్లాన్ తెలిపారు.
గతంలోకూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన యువతను సరైన మార్గంలో పెట్టడానికి సైన్యం అనేక చర్యలు చేపట్టింది. అయితే ఈ ఏడాది ప్రారంభించిన ‘ఆపరేషన్ మా’ ప్రత్యేకం. ఉగ్రవాద గ్రూపులను వదిలి వచ్చిన వారిపై ఏ విధమైన ప్రభుత్వ చర్యలు ఉండబోవని హామీ ఇస్తున్నారు. అటువంటి వారి వివరాలను బయటకు కూడా చెప్పరు. వారి దగ్గరి బంధువులకు కూడా తెలియనంత గోప్యంగా ఉంచుతారు. అంతేకాకుండా వారి పునరావాసానికి సంబంధించిన వివరాలు కూడా ఎవరికీ తెలియనీయకుండా ఉంచుతారు. ఉగ్రవాద ముఠాల్లో చేరకపోయినా.. వారి పట్ల సానుభూతి కలిగి, రాళ్లు విసరడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే యువతకూ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద యువతను ఆహ్వానిస్తూ సైన్యం నిరంతరం రిక్రూట్మెంట్ డ్రైవ్లను కూడా నిర్వహిస్తోంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
