
తాజా వార్తలు
దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష(రివ్యూ) పిటిషన్ వేయాలా వద్దా అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముస్లిం పక్షాల తరఫు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ తెలిపారు. ఈ మేరకు నవంబరు 17న జరిగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశంలో రివ్యూ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై జిలానీ ఇదివరకే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తీర్పు తమ అంచనాలకు తగ్గట్లుగా లేదని, మసీదుకు ప్రత్యామ్నాయంగా ఎన్ని వందల ఎకరాల్చినా ఎలాంటి విలువ ఉండదని గత శనివారం జిలానీ వ్యాఖ్యానించారు. ఓ లాయర్‌గా కాకుండా.. ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యదర్శిగా ఈ తీర్పు తనకు సంతృప్తినివ్వలేదని పేర్కొన్నారు.
అయోధ్య కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గత శనివారం చారిత్రక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిరం కోసం అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
