
తాజా వార్తలు
టెహ్రాన్: ఇరాన్లో మరో భారీ చమురు క్షేత్రాన్ని కనుగొన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదివారం ప్రకటించారు. దక్షిణ ఇరాన్‌లోని ఖుజెస్థాన్ ప్రావిన్స్ ప్రాంతంలో 50 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు. యాజ్డ్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం లభ్యమైన చమురు నిల్వలు వాణిజ్య ఉపయోగాలకు వినియోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఇది ఇరాన్‌లోనే అతిపెద్దదైన అహ్వజ్ చమురు క్షేత్రం(65బిలియన్ బ్యారెళ్లు) తర్వాత రెండో పెద్ద క్షేత్రం. అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన అనంతరం ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ మరో చమురు క్షేత్రాన్ని కనుగొనడంతో ఆదేశంలో భారీ చమురు నిల్వలున్నట్లు తెలుస్తోంది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
