close

తాజా వార్తలు

తీర్పు చెప్పిన న్యాయమూర్తులు వీరే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ భారతదేశం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన అయోధ్య కేసులో చరిత్రాత్మక తీర్పు వెల్లడైంది. దశాబ్దాల తరబడి కోర్టుల్లో నానుతూ వచ్చిన ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో ఐదుగురి సభ్యుల ధర్మాసనం ఓ పరిష్కారం చూపింది. అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులదేనని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చరిత్రాత్మక తీర్పును న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయంతో వెల్లడించడం విశేషం. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన కేసులో తుది తీర్పు వెల్లడించిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల గురించి క్లుప్తంగా..

జస్టిస్‌ రంజన్‌ గొగొయి (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి)

పుట్టిన తేదీ: 1954 నవంబర్‌ 18న అసోంలోని దిబ్రుగఢ్‌లో జన్మించారు. 
విద్యార్హత: చరిత్రలో గ్రాడ్యుషన్‌, న్యాయశాస్త్రంలో పట్టా
న్యాయవాదిగా నమోదు: 1978లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు. గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు.
న్యాయమూర్తిగా:  2001 ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
⇒ 2000 సెప్టెంబర్‌ 9న పంజాబ్‌- హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 
పదోన్నతిపై  2011 ఫిబ్రవరి 12న హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయ్యారు.  
అక్కడి నుంచి 2012 ఏప్రిల్‌ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
2018 అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
 పదవీ విరమణ: ఈ నెల 17న 

జస్టిస్‌ ఎస్‌ఆర్‌ బోబ్డే (భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి) 

పూర్తి పేరు:  జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే
పుట్టిన తేదీ:  1956 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో
విద్యార్హత:   బీఏ, ఎల్‌ఎల్‌ఎం
న్యాయవాదిగా నమోదు: 1978లో మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌లో సుమారు 21 ఏళ్లు న్యాయవాదిగా కొనసాగారు.
న్యాయమూర్తిగా...: 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2012 అక్టోబరు 16న మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
2013 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
 పదవీ విరమణ:  23.04.2021

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి


పూర్తిపేరు: ధనుంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ 
పుట్టిన తేది: 1959 నవంబర్‌ 11న ముంబయిలో జన్మించారు.
విద్యార్హత: దిల్లీ వర్సిటీలో ఎల్ఎల్‌బీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌ఎం పూర్తిచేశారు.
న్యాయవాదిగా: 1998 జూన్‌లో ఆయన బాంబే హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. 1998 నుంచి న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకూ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు.
న్యాయమూర్తిగా..: 2000 మార్చి 29న ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
2013 అక్టోబర్‌ 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  భారత ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్‌ తనయుడాయన. 

జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

పుట్టిన తేదీ: 1958 జనవరి 5, కర్ణాటకలోని బెలగావిలో జన్మించారు.
విద్యార్హత:  బీకాం, న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడు
న్యాయవాదిగా..  1983లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. అనంతరం కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీసు చేశారు.
న్యాయమూర్తిగా.. : 2003 మే నెలలో ఆయన కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తుండగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  
2017 ఫిబ్రవరి 17న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు వచ్చే ముందు ఆయన దేశంలోని ఏ హైకోర్టులోనూ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయలేదు. ట్రిపుల్ తలాక్‌కు రాజ్యాంగ ప్రామాణికతను నిర్ణయించే ధర్మాసనంలో ఈయన కూడా ఒకరు.

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

పుట్టిన తేదీ: 1956 జులై 5న యూపీలోని జాన్‌పూర్‌లో జన్మించారు.
విద్యార్హత: బీఏ, అలహాబాద్‌ వర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 
న్యాయవాదిగా..: 1979 ఏప్రిల్‌ 6న యూపీ బార్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 
న్యాయమూర్తిగా..: 2001 ఏప్రిల్‌ 24న ఆయన అలహాబాద్‌ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
2014 జులై 10న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం
 2016 మార్చి 26 ఆగస్టు 1న కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. (అంతకముందు కొన్నాళ్ల పాటు అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు)
2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  పాన్ కార్డుకు ఆధార్ లింకును తప్పనిసరి చేయడంపై పాక్షిక స్టే ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ అర్జున్ సిక్రీతోపాటూ భూషణ్ కూడా ఉన్నారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.