
తాజా వార్తలు
యూపీ డీజీపీ
లఖ్‌నవూ: అయోధ్యపై తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అభ్యంతరకర సందేశాలు, వదంతులు వ్యాప్తి చేయోద్దని ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ.సింగ్ కోరారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. అవసరమైతే జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. వదంతుల నుంచి అప్రమత్తంగా ఉండాలని యూపీ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే తీర్పు నేపథ్యంలో అయోధ్య నగరం సహా రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న భద్రతా ఏర్పాట్లను వివరించారు. ఇప్పటికే ఒక జిల్లాలో 24గంటల అంతర్జాల సేవల్ని నిలిపివేశామని..అవసరమైతే మిగతా ప్రాంతాలకూ దీన్ని విస్తరిస్తామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 42మంది అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 670అనుమానికి సామాజిక మాధ్యమాల ఖాతాలను బ్లాక్ చేశామని తెలిపారు. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచామన్నారు. అయోధ్య, లఖ్‌నవూ నగరాల్లో హెలికాప్టర్ ద్వారా గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అయోధ్య నగరంలో ఏడీజీ ర్యాంక్ అధికారిని నియమించామన్నారు.
గత నెల రోజులుగా పలు వర్గాలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకున్నామని ఓపీ సింగ్ తెలిపారు. మత పెద్దలు, పౌరసమాజ ప్రతినిధులతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
