close

తాజా వార్తలు

రూ.5 లోపు మాత్రల ధర పెంపు!


ఈనాడు, దిల్లీ: ఒక్కొక్కటి రూ.5 లోపు ఖరీదు చేసే మాత్రలు, గొట్టపు మాత్రల (క్యాప్సుల్‌) ధరను ఏటా 10% వరకు పెంచుకునేందుకు త్వరలో అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పెంపుదలకు అనుమతించాలని ఔషధ తయారీదారులు చాలాకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ ఔషధాల స్థాయీ సంఘం (ఎస్‌ఎన్‌సీఎం) త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ‘‘జాతీయ అత్యవసర ఔషధాల జాబితా-2015’’ను పునఃసమీక్షించనున్నారు. రూ.5 లోపు మాత్రల్ని ధరల నియంత్రణ పరిధి నుంచి తొలగించాలని తయారీదారులు కోరుతున్నారు. తదనుగుణంగా ధరను 10% వరకు పెంచుకునేందుకు అనుమతించినా, మార్కెట్లో పోటీ దృష్ట్యా ఒక స్థాయికి మించి పెంపు ఉండకపోవచ్చని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.