close

తాజా వార్తలు

చీకట్లో మా వికెట్లు తీశారు: డుప్లెసిస్‌

జోహెన్స్‌బర్: ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా టీమ్‌ఇండియా చేతిలో 0-3తో వైట్‌వాష్‌ అయిన సంగతి తెలిసిందే. దీనిలో రెండు టెస్టులు ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో సఫారీసేన ఘోరపరాభవాన్ని చవిచూసింది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఓటమికి కొత్త కారణం చెబుతున్నాడు. చీకటిగా ఉన్న సమయంలో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి మూడు వికెట్లు తీసిందని అన్నాడు. ‘ప్రతి టెస్టులో వారు తొలుత బ్యాటింగ్‌ చేసేవారు. 500 పరుగులు చేసి చీకటి సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసేవారు. ఆ తర్వాత చీకట్లో మా మూడు వికెట్లు పడగొట్టేవారు. దీంతో మూడో రోజు ఆట ఒత్తిడితో మేము కొనసాగించాల్సి వచ్చేది. ప్రతి టెస్టులోనూ ఇదే పునరావృతం అయ్యింది’ అని అన్నాడు. 

‘ టాస్‌ లేకపోతే పర్యాటక జట్టుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. దక్షిణాఫ్రికాలో అయినా అంతే. మేము పచ్చిక మైదానంలో కూడా బ్యాటింగ్‌ చేయగలం. భారత్‌తో జరిగిన ఆఖరి టెస్టును గొప్పగా ప్రారంభించాం. కానీ, తర్వాత ఒత్తిడికి లోనయ్యాం. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మాజీల సహాయం అవసరం. ఖర్చు ఎక్కువైనా మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలి’ అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. అయితే అతడి కామెంట్లపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో డుప్లెసిస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఓటమికి కారణాలు చెప్పకుండా గెలవడానికి ప్రయత్నించు’, ‘జట్టులో సీనియర్‌ ఆటగాడిగా ఉన్న నువ్వు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావు’ అని కామెంట్లు చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.