close

తాజా వార్తలు

ఎడారిలో భారత సైన్యం యుద్ధ విన్యాసాలు

జైపుర్‌: పోరాట సత్తాను పరీక్షించడంలో భాగంగా భారత సైన్యం నవంబరు 29 నుంచి డిసెంబర్‌ 4 వరకు ‘సింధు-సుదర్శన్’ పేరుతో రాజస్థాన్‌ ఎడారుల్లో విన్యాసాలు నిర్వహించనుంది. 40వేల మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే పాల్గొనేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన దళాలు కూడా ఇందులో పాల్గొననున్నాయి. శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయే సన్నద్ధతను ఈ విన్యాసాల్లో పరీక్షిస్తారు. సైన్యానికి చెందిన ట్యాంకులు ఇతర ఆయుధ పరికరాలను కూడా పరీక్షించనున్నారు. పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతపై సైన్యం సమీక్ష నిర్వహించనుంది. ఈ విన్యాసాల్లో లక్ష్యాలను ధ్వంసం చేయడం, బలగాల తరలింపు కోసం భారత వైమానిక దళం సైన్యానికి సహకరించనుంది. తద్వారా సైన్యం, వైమానిక దళం సమన్వయాన్ని కూడా పరీక్షించనున్నారు. ఈ విన్యాసాల కోసం ఎడారుల్లో పూర్తిగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించనున్నారు. 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.