close

తాజా వార్తలు

పాక్‌ కాల్పుల్లో అమరులైన ఇద్దరు జవాన్లు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు ఆదివారం మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. ఓ సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల నెపంతో చొరబాటుదారులను భారత భూభాగంలోకి పంపేందుకు పాక్ బలగాలు ప్రయత్నిస్తున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడులను మన భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల్లోని మరో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారని సమాచారం. అలాగే రెండు ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.