close

తాజా వార్తలు

పాకిస్థాన్‌ ఇక తప్పించుకోలేదు

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

దిల్లీ: ఉగ్రవాదులకు, సంస్థలకు ఆర్థిక సహకారం అందించే విషయమై నిన్న ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్ఏటీఎఫ్‌) పాకిస్థాన్‌కు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడారు. పాక్‌పై ఎప్పుడూ లేని ఒత్తిడి పెరిగిందని, తప్పించుకోవడం కుదరదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

‘పాకిస్థాన్‌ మీద ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. కచ్చితంగా వాళ్లు చర్యలు తీసుకుని తీరాల్సిందే. శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి దాయాది దేశాన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ‘గ్రే లిస్ట్‌’లో పెట్టడం ఏ దేశానికికైనా ఎదురు దెబ్బే. అలాంటిదీ ‘బ్లాక్‌ లిస్ట్‌’లో పెడితే ఏ దేశమూ కోలుకోలేదు. కాబట్టి పాక్‌ ఇప్పుడు ఎఫ్‌ఏటీఎఫ్‌ సిఫార్సులను కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే’ అని అన్నారు. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన 27 లక్ష్యాల్లో 22 అంశాల్లో పాక్‌ విఫలమైంది. దీంతో ఆ సంస్థ పాక్‌పై అక్షింతలు వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సిఫార్సులను అమలు చేయకపోతే..పాక్‌ను ‘బ్లాక్‌ లిస్ట్‌’లోకి చేర్చుతామని హెచ్చరించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.