close

తాజా వార్తలు

‘నేను కోళ్లు దొంగిలించేవాడిలా కన్పిస్తున్నానా’

ప్రచారంలో కన్నీళ్లు పెట్టుకున్న ఆజమ్‌ ఖాన్‌

రామ్‌పూర్‌: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్‌ నేత ఆజమ్‌ ఖాన్‌ ప్రచార సభలో బోరుమన్నారు. రామ్‌పూర్ ఉప ఎన్నిక సందర్భంగా ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన మేకల్ని, కోళ్లను, గేదెలను దొంగిలించినట్లు ఓ వ్యక్తి ఆజమ్‌ ఖాన్‌పై కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీని గురించి మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

 ‘నా మీద ఐపీసీ 307(హత్యాయత్నం) కేసు మోపారు. నన్ను నేను నిరూపించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. నా మీద దొంగతనం కేసు కూడా పెట్టారు. మేకలను, కోళ్లను, గేదెల్ని దొంగిలించినట్లు నాపై ఆరోపణలు చేశారు. అలాంటి పనులు నేను చేస్తానా? నేను తప్పులు చేస్తూ ఉంటే దేవుడు నన్ను ఎందుకు శిక్షించడం లేదు? రామ్‌పూర్‌ ప్రజల ప్రయోజనాల కోసం నా డబ్బులు ఖర్చుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేను కోళ్లను దొంగిలిస్తానా?’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆజమ్‌ ఖాన్‌పై ప్రస్తుతం వివిధ అంశాలకు సంబంధించి 80 కేసులు నమోదయ్యాయి. ఈనెల 5న ఆయన సిట్‌ ఎదుట కూడా హాజరయ్యారు. ఈయనపై ఉన్న కేసుల విచారణ ఈనెల 29న జరగనుంది. ఇక రామ్‌పూర్‌లో జరగనున్న ఉపఎన్నికల్లో ఆజమ్‌ భార్య తజీన్‌ ఫాతిమా ఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఆమె తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.