close

తాజా వార్తలు

భారీ ఉగ్ర కుట్ర భగ్నం

ఛండీగఢ్‌: దేశంలో విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల భారీ కుట్రను పంజాబ్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌, జర్మనీ మద్దతుతో నడుస్తున్న ఖలిస్థాన్‌ జిందాబాద్ ఫోర్స్‌ (కేజడ్‌ఎఫ్‌) ఉగ్ర సంస్థకు చెందిన మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు ఏకే-47, పిస్టళ్లు, ఉపగ్రహ ఫోన్లు, గ్రనేడ్లు వంటి భారీ ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఎన్‌ఐఏకు అప్పగించేందుకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నిర్ణయించారు. ఈ మేరకు పంజాబ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించిది. సరిహద్దుల్లో ఆయుధాలు సరఫరా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. 

ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్‌తో పాటు దేశంలో ఏవైనా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందేమో అని ఐఏఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌తో పర్యవేక్షణ చేయించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై డీజీపీ దినకర్ గుప్తా మాట్లాడుతూ.. ఈ ఆయుధాలు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ద్వారా ఇండో పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌లను ఉపయోగించి సరఫరా చేసి ఉండొచ్చని తెలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌ల్లో పెద్ద ఎత్తున చొరబాట్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని చెప్పారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం నిషేధిత ఉగ్రవాదులు కశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో కుట్రకు ప్రణాళికలు రచించినట్లు తెలియడంతో ఈ ఆపరేషన్‌ చేపట్టామని చెప్పారు. ఇందులో అమృత్‌సర్‌ ఇంటెలిజెన్స్‌ ఏఐజీ కేతన్‌ బలిరాం, ఛండీగఢ్‌కు చెందిన ఇతర పోలీసు బృందాలు పాల్గొన్నట్లు వెల్లడించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.