close

తాజా వార్తలు

అమెరికా-చైనా.. మళ్లీ వాణిజ్య చర్చలు

అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్న ట్రంప్‌

బీయరజ్‌: పరస్పర సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అగ్రదేశాలు అమెరికా, చైనా మళ్లీ చర్చలకు సిద్ధమయ్యాయి. అతి త్వరలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. 

ఫ్రాన్స్‌లోని బీయరజ్‌లో జరుగుతున్న జీ7 సదస్సుకు హాజరైన ట్రంప్‌ అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘నిన్న రాత్రి చైనా అధికారుల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. మళ్లీ చర్చలు మొదలుపెడతాం అని ఆ దేశం ప్రతిపాదన తెచ్చింది. అతి త్వరలోనే మేం వాణిజ్య చర్చలు జరుపుతాం’ అని ట్రంప్‌ తెలిపారు. చైనా అధికారులు రెండు సార్లు ఫోన్‌ చేశారని, అమెరికాతో ఒప్పందానికి రావాలని వాళ్లు అనుకుంటున్నారని ట్రంప్‌ అన్నారు. 

ఇటీవలే 550 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న ఆందోళనల నేపథ్యంలో చైనాతో వాణిజ్య యుద్ధం ఆపాలని జీ7 సదస్సు సందర్భంగా మిత్ర దేశాలు ట్రంప్‌నకు హితవు పలికాయి. మరి ఈ యుద్ధానికి రెండు దేశాలు ఇకనైనా స్వస్థి పలుకుతాయో.. లేదో వేచి చూడాలి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.