Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145124
            [news_title_telugu_html] => 

ఇది విన్నారా.. హఫీజ్‌ సయీద్‌ మంచివాడట!

[news_title_telugu] => ఇది విన్నారా.. హఫీజ్‌ సయీద్‌ మంచివాడట! [news_title_english] => Terrorist Hafiz Saeed Challenged his Arrest in Pakistan Court over Terror Financing Cases [news_short_description] => ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ తాను సచ్ఛీలుడినంటూ కోర్టు మెట్లెక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉగ్ర పేలుళ్లు, దాడులకు పథకాలు వేయడంలో ఆరితేరిన సయీద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతడ్ని పట్టిస్తే 10 లక్షల డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా కూడా ప్రకటించింది. [news_tags_keywords] => Hafiz Saeed, Arrest, Terror Financing, Terrorist [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:21:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇది విన్నారా.. హఫీజ్‌ సయీద్‌ మంచివాడట! - Terrorist Hafiz Saeed Challenged his Arrest in Pakistan Court over Terror Financing Cases - EENADU
close

తాజా వార్తలు

ఇది విన్నారా.. హఫీజ్‌ సయీద్‌ మంచివాడట!

కోర్టును ఆశ్రయించిన అంతర్జాతీయ ఉగ్రవాది

లాహోర్‌‌: ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ తాను సచ్ఛీలుడినంటూ కోర్టు మెట్లెక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉగ్ర పేలుళ్లు, దాడులకు పథకాలు వేయడంలో ఆరితేరిన సయీద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతడ్ని పట్టిస్తే 10 లక్షల డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా కూడా ప్రకటించింది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది అసలు తనకూ ఉగ్ర సంస్థలకు ఏ సంబంధమూ లేదని బుకాయిస్తూ, తన అరెస్టుకు నిరసనగా లాహోర్‌ హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. పైగా తన ఉగ్ర సంస్థ నిషేధిత జమాత్‌-ఉద్‌-దవా, దాని అనుబంధ ఫలాహ్‌-ఐ-ఇన్సానియత్‌ సంస్థల తరపున ఉన్న ఆస్తులను మసీదుల అభివృద్ధికి ఉపయోగిస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొనడం మరీ ఆశ్చర్యకర విషయం.
లష్కర్‌-ఏ-తోయిబా ఉగ్ర సంస్థకు సయీద్‌ ఆదాయ వనరులు సమకూర్చుతున్నారన్నది బహిరంగ రహస్యం. తాము ఉగ్రవాదాన్ని సహించబోమని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్‌ గత జులైలో హఫీజ్‌ సయీద్‌ను అరెస్టు చేసింది. అతనితో సహా తన సంస్థలకు చెందిన 67 మందిపై పంజాబ్‌ ప్రావిన్సులోని వివిధ నగరాల్లో పాక్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) 23 కేసులను నమోదు చేసింది. అయితే, ఈ కేసులన్నీ తమపై అన్యాయంగా పెట్టారని సయీద్‌ పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.
సయీద్‌ అరెస్టుపై పాక్‌లోని ఉగ్ర నిరోధక కోర్టు సెప్టెంబరు 2న విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం సయీద్‌ పటిష్ఠమైన బందోబస్తు నడుమ లాహోర్‌లోని కోల్‌ లఖ్‌పత్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఉగ్రవాదులను పాక్‌ అరెస్టు చేస్తుంది. కానీ వారికి అన్నీ సౌకర్యాలు అందుతాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.