
తాజా వార్తలు
బెంగళూరు: ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటి వరకు పలు దేశాల అంతరిక్షయాత్రలు చంద్రుడి పైకి చేరినా.. తాజా ప్రయోగం మాత్రం వాటన్నింటికంటే భిన్నమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ దేశ ఉపగ్రహం చేరని చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి మన రోవర్ చేరబోతోంది. అందుకే యావత్తు ప్రపంచం చంద్రయాన్-2 వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు ఆ ప్రాంతానికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. రూ. వేల కోట్ల వెచ్చిస్తున్నారు. కానీ, తొలిసారి చేరుకోబోతోంది మాత్రం మనమే. ఒకవేళ ఈ ప్రయోగం ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరితే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ చంద్రుడి దక్షిణ ధ్రువాన్నే ఇస్రో లక్ష్యంగా ఎందుకు ఎంచుకుంది? ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసానికి ఎందుకు పూనుకుంది? లాంటి పలు ప్రశ్నలకు ఇస్రో తెలిపిన కారణాలు...
* చంద్రుడి దక్షిణ ధ్రువంలో బిలియన్ల సంవత్సరాలుగా కనీసం సూర్యరశ్మి కూడా చేరకపోవడంతో చెక్కుచెదరకుండా ఉన్న బిలాలు(క్రేటర్స్) ఉన్నాయి . దీని వల్ల సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన కీలక సమాచారం లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
* చంద్రుడిపై కొన్నేళ్లుగా శాశ్వతంగా నీడలో ఉన్న కొన్ని బిలాల్లో దాదాపు 100 మిలియన్ టన్నుల నీటి నిల్వలు ఉన్నట్లు అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
* చంద్రుడి ఉపరితల పొరలో హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్, సోడియం, మెర్క్యూరీ, వెండి లాంట మూలకాల ఆనవాళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ఒకవేళ అదే గనక నిజమైతే.. చంద్రుడు మనకు ఇంధన వనరుగా మార్చుకోవడంపై ముమ్మర పరిశోధనలు జరుగుతాయి.
* అలాగే భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని మజిలీగా చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి. అంగారకుడిని, ఆపై గ్రహాల్ని చేరుకునే క్రమంలో చంద్రుడిని మజిలీగా చేసుకొంటే ఎన్నో ప్రయోజనాలు ఉండనున్నాయి. అమెరికా ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. మజిలీకి చంద్రుడి దక్షిణ ధ్రువం అత్యంత అనువైన ప్రాంతంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తాజా ప్రయోగంతో దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ చేపట్టిన చంద్రయాన్-2... పై విషయాలన్నింటిపై దృష్టి సారించనుంది. అందుకనుగుణంగా చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొట్టే రోవర్లో కెమెరాలు, సెన్సర్లతో పాటు పలు ఇతర ఉపకరణాలను పొందుపరిచారు. అది పంపించే సమాచారంతో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, ఇతర వనరుల నిల్వలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
