
తాజా వార్తలు
ఇమ్రాన్‌ఖాన్ కష్టాలను కళ్లకు గట్టిన ప్రతినిధి
కరాచీ: ‘‘మా సారు అధికారంలోకి వచ్చింది మొదలు అన్నీ సవాళ్లే.. వాటిని మా సారు స్వీకరించారు.. ఎంత కష్టపడ్డారో..’’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయ ప్రతినిధి నయీమ్ ఉల్ హక్ ఘనంగా వివరించారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధికారం చేపట్టి నిన్నటికి ఏడాది పూర్తిఅయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం గత ఏడాది సాధించిన విజయాలను ఒక పుస్తకంగా అచ్చేసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఇమ్రాన్ విజయాలను వివరించారు. ఇమ్రాన్ ఖాన్ వచ్చింది మొదలు కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రభుత్వ రంగంలోని చాలా సంస్థలు, సేవారంగం నష్టాల్లోకి జారుకొందని తెలిపారు. వీటన్నిటీ సవాలుగా స్వీకరించి ఇమ్రాన్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాగా కష్టపడ్డారని చెప్పారు. ‘‘గత ఏడాది ఆయన అధికారంలోకి వచ్చేనాటికే ఖజానా ఖాళీ అయింది. దేశంలో రోజువారి పనులు చేయడానికి కూడా డబ్బులేదు. ఆ సమయంలో మా మిత్ర దేశాలు ఆర్థికంగా ఆదుకొన్నాయి. పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఏకాకిగా మారింది. కానీ పీటీఐ ప్రభుత్వం ప్రపంచంలోని వివిధ దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్లింది. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. ’’ అని తెలిపారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన చిరు
- ‘ఏరా నీకంత పొగరా.. వేషం లేదు పో’ అన్నారు!
- నాటి చేతక్.. నేటి పల్సర్.. ఈయన కృషే..!
- మాజీ ప్రియురాలితో షూటింగ్‌కి నో..
- ఐరాస మెచ్చినఅందాల అమ్మ
- ఏదో ఒక రోజు బాలీవుడ్ సినిమాలో చూస్తారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
