close

తాజా వార్తలు

చైనా ‘సుంకాలు’ తిని బతుకుతోంది: ట్రంప్‌

వాష్టింగన్‌: అమెరికా-చైనాల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ, ఒక దేశం వస్తువులపై మరో దేశం పన్నులు పెంచుతూ పోతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. తాను అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలతో పాటు ఆ దేశం అధికమొత్తంలో దిగుమతి సుంకాలను విధించడం వల్ల అతి తక్కువ సమయంలోనే చైనా 20 లక్షల ఉద్యోగాలు కోల్పోయిందని వెల్లడించారు. చైనా ఆర్థిక వ్యవస్థ నానాటికీ మరీ తీసికట్టుగా తయారవుతోందని అన్నారు. 

‘ద్రవ్య సంబంధ లావాదేవీల్లో మోసపూరితంగా వ్యవహరించడం ద్వారా చైనా సుంకాలు తిని బతుకుతోంది. ఉద్యోగాలు కోల్పోకూడదని దేశంలోకి కుప్పలు తెప్పలుగా నగదును మళ్లిస్తున్నారు. కానీ, అతి తక్కువ కాలంలోనే చైనా 20లక్షల ఉద్యోగాలను కోల్పోయింది’ అని ట్రంప్‌ అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని చైనా ఆకాంక్షిస్తోంది. ఈ విషయమై ఇరు దేశాల అధికారులు పలు దఫాలుగా సమావేశం అయ్యారని తెలిపారు. ‘ఏం జరుగుతుందో చూద్దాం. కానీ, వాళ్లు తప్పక ఒప్పందం చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. 

‘నేను తీసుకున్న చర్యల కారణంగా గత 27ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యంత ప్రతికూల సంవత్సరాన్ని చైనా చవి చూస్తోంది. వాళ్లు చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది. చైనా విధించే 25శాతం దిగుమతి పన్నులు చెల్లించలేక పలు కంపెనీలు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాయి. లక్షలమంది ఉపాధి కోల్పోతున్నారు.’ అని అన్నారు. ఇక ఆర్థిక మాంద్యం గురించి ఆయనను ప్రశ్నించగా, ‘చైనా లాంటి చెడ్డ దేశాలు అనేకం ఉన్నాయి. మా విషయంలో ఆయా దేశాలు ఎవరి పంథాలో వాళ్లు వ్యవహరిస్తున్నారు. యూరోపియన్‌ యూనియన్‌తో ఏమవుతుందో చూడాలి. వారికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆయా దేశాలన్నింటి గురించి నేను ప్రస్తావించను. అలా చేస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. అమెరికా మరింత దృఢంగా కాబోతోంది. అందుకు కొంచెం సమయం పట్టవచ్చు లేదా ముందుగానే అది జరగవచ్చు. ప్రస్తుతానికి చైనాతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చైనా మాత్రం ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. కానీ నేను సిద్ధంగా లేను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్
Saket Pranamam
VITEEE 2020
HITS2020

Panch Pataka

దేవతార్చన