close

తాజా వార్తలు

ఆ హత్యలకు కారణం వీడియోగేమ్స్‌: ట్రంప్‌

వాషింగ్టన్‌: ఇటీవల అమెరికాలోని ఎల్‌ పెసో, డేటొన్‌ వంటి చోట్ల చోటు చేసుకున్న కాల్పులకు హింసాత్మకమైన వీడియోగేమ్‌లు కూడా ఒక కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌, హౌస్‌ మైనార్టీ నాయకుడు కెవిన్‌ మెక్‌క్రాథీ పేర్కొన్నారు. దీంతో తుపాకుల  విక్రయాలను కట్టడి చేయాలని కొన్ని వారాల క్రితం తీసుకున్న నిర్ణయం అమలయ్యే అవకాశాలను ఈ వ్యాఖ్యలు దెబ్బతీసేవిగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. టెక్సాస్‌,  ఒహయోలో కాల్పుల నేపథ్యంలో ప్రాణాంతక తుపాకుల విక్రయాలను నియంత్రించాలని చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టేవిగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. 
సోమవారం ఉదయం ట్రంప్‌ శ్వేత సౌధంలో మాట్లాడుతూ ‘‘ మన సమాజంలో హింసను ఒక ఘనకార్యంలా చూపడం ఆపేయాలి. ముఖ్యంగా హింసాత్మకమైన వీడియోగేమ్స్‌లో ఇది సర్వసాధారణమైపోయింది. సమస్యల్లో ఉన్న యువతకు హింసను సంబరంలా జరుపుకోవడం సాధారణమైపోయింది. ఇలాంటి పోకడలను తక్షణమే నిలిపేందుకు చర్యలు మొదలుపెడతాము’’ అని పేర్కొన్నారు. అంతేగానీ ఆయుధాల విక్రయాలపై నియంత్రణకు చేపట్టే చర్యలను మాత్రం ప్రస్తావించలేదు.  
దీనిపై డెమోక్రాటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌ స్పందిస్తూ ‘‘భూమిపై ఇతర దేశాల్లో కూడా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. భూమిపై ఇతర దేశాల్లో కూడా వీడియోగేమ్స్‌ ఆడుతున్నారు. అక్కడికి.. ఇక్కడికి తేడా కేవలం తుపాకులే’’ అని ట్వీట్‌ చేశారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.