close

తాజా వార్తలు

ఐదు ముగిశాయ్‌‌.. ఇక చంద్రుడి కక్ష్యలోకే

దిల్లీ : భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్‌-2’.. లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా విజయవంతంగా ఐదోసారి దీని కక్ష్యను పెంచారు. భూస్థిర కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-2 కక్ష్యను మంగళవారం మధ్యాహ్నం ఐదో సారి పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. 

‘ఈ రోజు మధ్యాహ్నం 3.04 నిమిషాల సమయానికి ఇంజిన్లను 17 నిమిషాల పాటు మండించి  276X142975 కి.మీ పరిధి  కక్ష్యలో చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రవేశపెట్టాం. ప్రస్తుతం అన్ని సవ్యంగా జరుగుతున్నాయి’ అని ఇస్రో అధికారులు తెలిపారు. నాలుగో దశ కక్ష్య పెంపు నాలుగు రోజుల క్రితమే విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే.  

ఆగస్టు 14న చంద్రుడు పరిభ్రమిస్తున్న కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశిస్తుంది. అనంతరం చంద్రుడి స్థిర కక్ష్యలోకి ఆగస్టు 20 నాటికి చేరుతుంది. అనంతరం సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ విక్రమ్‌ దిగుతుంది. విక్రమ్‌ నుంచి ప్రజ్ఞాన్‌ అనే రోవర్‌ బయటకొచ్చి పరిశోధనలు జరుపుతుంది. గత నెల 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.