close

తాజా వార్తలు

చంద్రయాన్‌-2 నుంచి భూమి ఇలా..

దిల్లీ: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. భూస్థిర కక్ష్యలో ప్రయాణిస్తున్న చంద్రయాన్‌-2.. ఎల్‌14 కెమెరాతో భూమికి సంబంధించిన అద్భుతమైన  ఫొటోలను తీసి ఇస్రోకు పంపింది. తొలిసారిగా చంద్రయాన్‌ తీసిన ఈ ఫొటోలను ఇస్రో పంచుకుంది.

గత నెల 22న ప్రారంభమైన ఈ ప్రయోగం దిగ్విజయంగా సాగుతోంది. చంద్రయాన్‌ కక్ష్యను ఇప్పటికే ఓ సారి పొడిగించారు. శుక్రవారం మధ్యాహ్యం మరోసారి పెంచారు. ఇందుకోసం చంద్రయాన్‌-2 ఇంజిన్లను 10 నిమిషాల పాటు మండించారు. ప్రస్తుతం ఉపగ్రహం నాలుగో భూ స్థిర కక్ష్యలో తిరుగుతోందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. మరోసారి ఆగస్టు 6న కక్ష్య పెంపు ప్రక్రియను చేపడతామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఆగస్టు 20 కల్లా చంద్రయాన్‌-2 చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరనుంది. అనంతరం చంద్రయాన్‌-2 నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.