close

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

లఖ్‌నవూ: మాజీ కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రా సోమవారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. వయసు మీదపడటంతో మిశ్రా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్ గుజరాత్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఇదిలా ఉండగా, రానున్న మూడు నెలల్లో 10 రాష్ట్రాల గవర్నర్‌ల పదవీ కాలం పూర్తి కానుంది. వారిలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్‌ రామ్ నాయక్ కూడా ఉన్నారు. ఆ రాష్ట్రాలకు కేంద్రం కొత్తవారిని నియమించే ప్రక్రియను హిమాచల్ ప్రదేశ్‌తో ప్రారంభించింది. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతం నుంచి ఎన్నికైన కల్‌రాజ్ మిశ్రా ఎన్డీఏ-I ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 75 సంవత్సరాలు పైబడటంతో 2017లో ఆ పదవికి రాజీనామా చేశారు. అదే కారణంతో ఈసారి ఎన్నికల్లోను పోటీ చేయలేదు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.