
తాజా వార్తలు
కోల్కతా: ఉన్నట్నుండి వర్షం కురిస్తే? తడవకుండా ఉండేందుకని జనం పరుగులు తీస్తారు. అదే కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే? ‘వామ్మో.. వాయమ్మో... ఏమిటీ డబ్బుల వర్షం’ అని కళ్లప్పగించి ఆశ్చర్యపోరూ? అదే జరిగింది కోల్కతాలో! డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బుధవారం కోల్కతాలోని ఓ భవనంపై దాడులు చేపట్టారు. అందులోని ఆరో అంతస్తులో ఎగుమతి-దిగిమతుల వ్యాపారం నిర్వహించే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుంకం చెల్లించకపోవడంతో అధికారులు దాడులు చేశారు. వారి రాకను గమనించి... సంస్థ నిర్వాహకులు రూ.2,000, రూ.500, రూ.100 నోట్లను కిటికీలోంచి బయటకు విసిరేశారు.
Tags :